ఫ్రెండ్‌తో కలిసి పట్టుబడ్డ నటి

11 May, 2020 08:05 IST|Sakshi
సామ్ అహ్మద్‌ బాంబే, పూనమ్‌ పాండే (ఫైల్‌)

ముంబై: బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే, ఆమె స్నేహితుడిపై ముంబై పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై ఈ చర్య తీసుకున్నారు. వారి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్‌ చేసి తర్వాత విడిచిపెట్టారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి ఆదివారం రాత్రి 8.05 గంటల సమయంలో బిఎమ్‌డబ్ల్యూ కారులో తిరుగుతున్నట్టు గుర్తించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. పూనమ్‌ స్నేహితుడిని బాంద్రా (వెస్ట్)లో నివాసం ఉంటున్న చిత్ర దర్శకుడు సామ్ అహ్మద్‌ బాంబే(46)గా గుర్తించారు.  

పూనమ్‌ పాండే, ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశందర్ ధ్రువీకరించారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో వీద్దరిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 188, 269, జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. (టాప్‌లో ప్రియాంక... సల్మాన్‌!)

అయితే పూనమ్‌ పాండేకు వివాదాలు కొత్త కాదు. గతంలో సంచలన ప్రకటనలతో ఆమె వార్తల్లో నిలిచారు. తన నటనతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువ పాపులర్‌ అయ్యారు. 2011లో టీమిండియా వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిస్తే నగ్నంగా నిలబడతానని ప్రకటించి మొదటిసారి ఆమె వెలుగులోకి వచ్చారు. తర్వాత కూడా చాలాసార్లు వివాదాస్పద ప్రకటనలతో మీడియా దృష్టిని ఆకర్షించారు. నాషా, లవ్‌ ఈజ్‌ పాయిజన్‌, మాలిని అండ్‌ కో, ఆగయా హీరో, ది జర్నీ ఆఫ్‌ కర్మ తదితర సినిమాల్లో ఆమె నటించారు. కాగా, కొంతకాలంగా పూనమ్‌, సామ్ అహ్మద్ డేటింగ్‌ చేస్తున్నట్టు బాలీవుడ్‌లో ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా