పూనమ్‌ ‘పీకే లవ్‌’  ట్వీట్‌

21 Jan, 2018 18:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పవన్‌ కళ్యాణ్ అభిమానులు‌, కత్తి మహేష్‌ మధ్య జరిగిన హాట్‌ వార్‌లో తలదూర్చి కత్తి క్లాస్‌లతో సైడైపోయిన నటి పూనం కౌర్‌ మళ్లీ సంచలన ట్వీట్‌తో ముందుకొచ్చారు. కత్తి వ్యవహారం సద్దుమణిగిన క్రమంలో పూనం తాజా ట్వీట్లు ఎటు దారితీస్తాయోననే ఆందోళన నెలకొంది. పవన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ విమర్శకులకు చురకలు అంటించేలా ఆమె చేసిన ట్వీట్‌పై ఆసక్తికర చర్చ సాగుతోంది.

‘పవిత్రంగా ఉండాలనే ఆలోచన ఓ శక్తి..అది దైవత్వం కన్నా గొప్పది..అదే పీకే ప్రేమే. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా..? నన్ను విభేదిస్తూ ఎవరైనా ముందుకొస్తారా..? ‘అంటూ పూనం ట్వీట్‌ చేశారు.అయితే ఆమె ట్వీట్‌కు పవన్‌ అభిమానులు ఖుషీ అవుతుంటే..జరిగిన రచ్చ చాలు..మళ్లీ కెలకొద్దు అనే కామెంట్లూ పడుతున్నాయి.

మరిన్ని వార్తలు