నెట్‌లో... ఆ... ఫొటోలు

17 Dec, 2014 23:33 IST|Sakshi
నెట్‌లో... ఆ... ఫొటోలు

 పాప్ స్టార్ మడోనా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. దానికి కారణం ఎప్పుడో ఆమె దిగిన నగ్నచిత్రాలు, ఇతర చిత్రాలు ఇప్పుడు బయటికి రావడమే. ఎవరు తస్కరించారో కానీ.. వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు అంతర్జాలంలో ఎక్కడ చూసినా ఆ ఫొటోలే. మామూలుగానే మడోనా ఫొటోలంటే చాలా క్రేజ్ ఉంటుంది. ఇక, నగ్న చిత్రాలకు డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 
  ఈ ఫొటోలు బయటికి రావడం పట్ల మడోనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ -‘‘ఈ పని ఎవరు చేశారో అర్థం కావడం లేదు. నా అభిమానులు కాదనుకుంటున్నా. ఫొటోలు తస్కరించడమే నీచమైన పని అంటే వాటిని అమ్మడం ఇంకా నీచమైన పని. వాటిని కొన్నవాళ్లు కూడా నీచులతోనే సమానం. నా అభిమానులు నిజాయతీపరులైతే, నా మీద ప్రేమభిమానాలుంటే ఆ ఫొటోలు కొనొద్దు’’ అన్నారు. ఫొటోలు తస్కరించినవారి ఆచూకీ తెలుసుకుంటాననీ, నేరానికి ఎలాంటి శిక్ష అనుభవిస్తారో అప్పుడు తెలుస్తుందనీ మడోనా హెచ్చరించారు.