‘పోరా పోవే’ చిత్రం లోగో ఆవిష్కరణ

30 Aug, 2013 01:06 IST|Sakshi
‘పోరా పోవే’ చిత్రం లోగో ఆవిష్కరణ
‘‘ఈ టైటిల్ వింటుంటే, కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. ఈ దర్శకుడు నా దగ్గర ‘పూలరంగడు’ చిత్రానికి రచయితగా చేశారు. క్యాచీ టైటిల్‌తో ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం సాధిం చాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వీరభద్రమ్ చౌదరి. కరణ్, సౌమ్య సుకుమార్ జంటగా శ్రీనివాస్ బింగమల, యెల్కిచర్ల వీరేంద్రరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘పోరా పోవే’. 
 
 లంకపల్లి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం లోగోను వీరభద్రమ్, ప్రచార చిత్రాన్ని చంద్రబోస్ ఆవిష్కరించారు. యాజమాన్య మంచి స్వరాలిచ్చారని చంద్రబోస్ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది’’ అని చెప్పారు. 
 
 ఈ సినిమాకి కథే హీరో అని కరణ్ తెలిపారు. ‘‘మూడు సినిమాలకు రచయితగా చేసిన అనుభవంతో ఈ సినిమాకి దర్శకత్వం వహించాను. ప్రేమికుల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల నేపథ్యంలో సరదాగా సాగే సినిమా ఇది’’ అన్నారు దర్శకుడు.