తెరపైకి పోస్టర్లు అంటించే కుర్రాళ్ల జీవితాలు

7 Feb, 2015 03:44 IST|Sakshi
తెరపైకి పోస్టర్లు అంటించే కుర్రాళ్ల జీవితాలు

తాజ్‌మహల్‌కు రాళ్లెత్తిన కూలీలను ఎవరూ పట్టించుకుంటారు? అలాగే సినిమా ప్రచారానికి పోస్టరు అంటిం చేవారి జీవితాల గురించి అసలు ఎవరూ ఆలోచించరు. అలాంటి ముగ్గురు కుర్రాళ్ల జీవన విధానాలను ఆవిష్కరించే చిత్రంగా కె-3 తెరకెక్కించింది. కామథేను ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు ఎంఎస్ అన్నాదురై దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన చిత్రంలో విమల్‌రాజ్ హీరోగాను, ఆదిర హీరోయిన్‌గాను నటించారు.

విశ్వంత్, సుదీర్, పావలా లక్ష్మణ్‌మీసై రాజేంద్రనాథ్‌లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎన్.తిరుమురుగన్, ఏ.ప్రకాష్‌రాజ్ సహ నిర్మాతులగా వ్యవహరిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వివరించారు. అర్ధరాత్రుల్లో పోస్టర్లు అతికించే కదీర్, గంజా, కరుప్పు అనే ముగ్గురు యువకుల జీవన విధానాలే చిత్రకథ అని తెలిపారు. అందుకే ఈ చిత్రానికి కే-3 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు చెప్పారు.

ఈ ముగ్గురు కూలీలుగా ఎలామారారు? అం దుకు ఎవరు కారణం? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలతో విభిన్న కథనంతో తెరకెక్కిస్తున్న చిత్రం కే-3 అని చెప్పారు. ఈ పోస్టర్లు అం టించే పని ని 18 నుంచి 20 వయసుగల వా రే అధికంగా చేస్తుంటారు. చిత్ర షూ టింగ్‌ను తిరునెల్వేలి, కేరళ, చెన్నై, సే లం మొదలగు ప్రాంతాల్లో నిర్వహిం చినట్లు తెలిపారు. చిత్ర నిర్మాణం పూర్తయ్యిందని, ఈ నెల 20న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఓ కన్నడ నిర్మాత కన్నడ, తెలుగు అనువాద హక్కులను పొందినట్లు చెప్పారు.