సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు!

21 Dec, 2017 19:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత స్పీడు పెంచారు సీనియర్ హీరో, యువరత్న నందమూరి బాలకృష్ణ. ఆయన లేటెస్ట్ మూవీ  జై సింహా సినిమా టీజర్ గురువారం విడుదలైంది. ఫుల్ మాస్ యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొంత సమయానికి భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ తో జై సింహా టీజర్ దూసుకుపోతోంది.

'సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తదంటూ' బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 30 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో బాలయ్య నటనతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎం రత్నం మాటలు అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

మరిన్ని వార్తలు