ప్ర‌భాస్ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌కు కుదిరిన ముహూర్తం

8 Jul, 2020 11:58 IST|Sakshi

టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేద‌ని నిరాశ‌ప‌డిపోతున్న అభిమానుల‌కు అమృతం లాంటి వార్త‌! ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 20వ‌ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే బాహుబ‌లి ప‌క్క‌న జోడీ క‌ట్టింది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. మొన్న‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల షూటింగ్స్‌కు బ్రేక్ పడ‌టంతో డార్లింగ్ మూవీ ఇంకెంత ఆల‌స్యం అవుతుందోన‌ని అత‌డి అభిమానులు తెగ‌ భ‌య‌ప‌డిపోయారు. (ప్రభాస్‌-అశ్విన్‌ చిత్రం : విలన్‌ అతడేనా?)

కానీ ప్ర‌భుత్వం ఇటీవ‌లే సినిమా షూటింగ్స్‌కు ఓకే చెప్ప‌డంతో చిత్ర‌యూనిట్ ఈ నెల రెండో వారం నుంచి రెండో షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించిందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఈ సినిమాకు  ‘రాధే శ్యామ్‌’ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది శుక్ర‌వారం తేల‌నుంది. అవును.. ప్ర‌భాస్ 20వ‌ సినిమా యూనిట్.. జూలై 10న ఉద‌యం 10 గంట‌ల‌కు టైటిల్‌తోపాటు, ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌కు కూడా పీరియాడిక‌ల్ లుక్ వ‌చ్చేలా ట‌చ్ ఇచ్చింది. రోమ‌న్ అంకెలున్న గ‌డియారం, దాని చుట్టూ పువ్వులు అలంక‌రించిన‌ట్లుగా క‌నిపిస్తూ కొంత కొత్త‌గా, మ‌రికొంత భిన్నంగా ఆక‌ట్టుకుంటోంది. (నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ – ప్రభాస్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా