‌రాధేశ్యామ్: రొమాంటిక్‌గా ప్ర‌భాస్‌

10 Jul, 2020 10:29 IST|Sakshi

అభిమానులు ఎంత‌గానో ఎదురుచూసిన ప్ర‌భాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ రానే వ‌చ్చింది. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఏమాత్రం మెరుపు త‌గ్గ‌ని ప్ర‌భాస్ రాయ‌ల్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డేను ద‌గ్గ‌ర‌గా అదిమి ప‌ట్టుకున్న హీరో త‌న్మ‌య‌త్వంలో ఉన్నాడు. అటు ఖ‌రీదైన దుస్తుల్లో ఉన్న పూజా కూడా ప్ర‌భాస్‌కు ప‌ర్ఫెక్ట్ జోడీగా క‌నిపిస్తోంది. ఫ‌స్ట్ లుక్ చూస్తోంటే సినిమాలో రొమాంటిక్ డోస్ ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ముందు నుంచీ ఊహించిన అంచనాల‌ను నిజం చేస్తూ "రాధేశ్యామ్" అనే టైటిల్‌నే చిత్ర‌యూనిట్ ఖ‌రారు చేసింది.  జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. (‘బాహుబలి’ ఖాతాలో మరో అవార్డు)

ఈ చిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు 'రాధేశ్యామ్' జార్జియాలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ స్టూడియోలో రెండో షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఇందులో భ‌ళ్లాల దేవ రానా కూడా అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. విల‌న్ ఎవ‌ర‌నేది మాత్రం ఇప్ప‌టికీ గోప్యంగానే ఉంచుతున్నారు. మ‌రోవైపు ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసిన కొద్ది నిమిషాల్లోనే వైర‌ల్ అవుతోంది. (ఐదు కోట్లతో ఆస్పత్రి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు