చాలెంజ్‌లు  విసిరింది!

10 Feb, 2019 00:08 IST|Sakshi

‘‘నా కెరీర్‌లో నేను విన్న చాలెంజింగ్‌ స్క్రిప్ట్స్‌లో ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న సినిమా ఒకటి’’ అంటున్నారు పూజా హెగ్డే. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌స్టొరీగా 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్‌ ఇటలీలో జరగనుంది.

ఇందులో చేస్తున్న పాత్ర గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘ప్రభాస్‌ 20’ స్క్రిప్ట్‌ చాలా అద్భుతంగా ఉంది. స్క్రిప్ట్‌ విన్న వెంటనే స్టన్‌ అయిపోయాను. అలాగే ఈ స్క్రిప్ట్‌ నాకు చాలా చాలెంజ్‌లు కూడా విసిరింది. టీమ్‌ అంతా చాలా కష్టపడుతున్నాం. మీ అందరికీ సరికొత్త సినిమా ఇస్తాం అనే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి చాలా టైటిల్స్‌ అనుకుంటున్నాం. ఇంకా ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. టైటిల్‌ ఫిక్స్‌ అయిన వెంటనే తెలియజేస్తాను’’ అన్నారు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు