ప్రభాస్‌ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ

26 Dec, 2019 18:10 IST|Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం స్నేహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నాడు. ప్రభాస్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘సాహో’. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ వచ్చినా.. బాక్సాఫిస్‌ వద్ద  కలెక్షన్ల వర్షం కురిపించాయి. కాగా డార్లింగ్‌ విషయంలో అందరి మదిలో మెదిలే ప్రశ్నఆయన పెళ్లి. ప్రభాస్‌ పెళ్లి విషయంలో వచ్చిన రూమర్స్‌ అన్నీ ఇన్నీ కావు. బాహుబలి తర్వాత, సాహో తర్వాత పెళ్లి అంటూ అనేక కథనాలు రాగా అవన్నీ అబద్ధాలుగానే మిగిలిపోయాయి. ఇక తాము అభిమానించే హీరో పెళ్లి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ప్రభాస్‌ అభిమానులకు ఈ విషయం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఇప్పటి వరకు ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడనే విషయంపై క్లారిటీ రాలేదు. 

తాజాగా ప్రభాస్‌ నటిస్తున్న ‘జాన్‌’ మూవీ అనంతరం డార్లింగ్‌ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ పెళ్లిపై పెదనాన కృష్ణం రాజు భార్య శ్యామలా దేవీ స్పందించారు. శ్యామల దేవి మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌ పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. తన వివాహ విషయంలో వస్తున్నవన్నీ పుకార్లు. అవిచూసి మేము చాలా నవ్వుకున్నాం. మాది పెద్ద కుటుంబం. అందరితో కలిసిపోయి ఉండే అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి కోసం చూస్తున్నాం. దొరకగానే ప్రభాస్‌ పెళ్లి’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా జిల్‌ ఫేం  రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్‌ మూవీలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. వెకేషన్‌లో ఉన్న ప్రభాస్‌ తిరిగి రాగానే జనవరిలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొనున్నారు. లవ్‌ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజ హెగ్డే కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అరుదైన కాంబినేషన్స్‌.. అదుర్స్‌

స్పెషల్‌ బర్త్‌డేను షేర్‌ చేసుకోనున్న సల్మాన్‌!

అత్త మామల ప్రేమతో: ఉపాసన కొణిదెల

బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్తే చంపేస్తాడు: కాజోల్‌

ఎట్టకేలకు వంద కోట్లు దాటింది

నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా ఇది

‘కోబ్రా’తో భయపెడుతున్న విక్రమ్‌

అదా శర్మ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

అది సల్మాన్‌ దగ్గరే నేర్చుకున్నా: సోనాక్షి

గీతా గోవిందం దర్శకుడితో ‘మహేష్‌బాబు’ సినిమా

సీఏఏ: శరత్‌కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దుస్తులపై విమర్శలు‌.. హీరోయిన్‌ ఆగ్రహం

మేమిద్దరం ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: రష్మిక

రెండు లక్షలమందికి ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం

మరో మూడు నెలల్లో రెండేళ్లు

తెల్లజుట్టు బాండ్‌

అంతఃకరణ శుద్ధితో...

హిట్‌ లుక్‌

ద్వితీయ విఘ్నం దాటారండోయ్‌

అది నా ఫెవరెట్‌ సాంగ్‌.. కానీ.., : రష్మిక

వసూళ్ల కన్నా భద్రతే నాకు ముఖ్యం: ప్రముఖ హీరో

నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు : నటుడు

నన్ను స్కూల్‌ నుంచి పంపేశారు: హీరో

‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’

‘ఇంతకంటే గొప్ప గిఫ్ట్‌ ఇవ్వలేను’

మహేశ్‌ అభిమానుల ఆగ్రహం

మహేశ్‌ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస

క్రిస్మస్‌ విషెస్‌ తెలిపిన టాలీవుడ్‌ స్టార్స్‌

‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీ రివ్యూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రభాస్‌ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ

స్పెషల్‌ బర్త్‌డేను షేర్‌ చేసుకోనున్న సల్మాన్‌!

అత్త మామల ప్రేమతో: ఉపాసన కొణిదెల

బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్తే చంపేస్తాడు: కాజోల్‌

ఎట్టకేలకు వంద కోట్లు దాటింది

నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా ఇది