రాముడు – రావణుడు?

20 Sep, 2019 00:30 IST|Sakshi
ప్రభాస్‌, హృతిక్‌ రోషన్

రామాయణ ఇతిహాసాన్ని భారీ బడ్జెట్‌తో స్క్రీన్‌ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మా తలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్‌ మల్హోత్ర. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నితేష్‌ తివారి (‘దంగల్‌’ ఫేమ్‌), రవి ఉడయార్‌ (‘మామ్‌’ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 

ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించేవారిలో రాముడిగా హృతిక్‌ రోషన్, సీత పాత్రలో దీపికా పదుకోన్‌ నటిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రావణ బ్రహ్మ పాత్రను  ప్రభాస్‌ చేస్తే బావుంటుందని చిత్రబృందం భావిస్తోందని ముంబై సమాచారం. రావణుడి పాత్రకు ప్రభాస్‌ ఫిజిక్‌ సరిగ్గా సూట్‌ అవుతుందని, ఆల్రెడీ ‘బాహుబలి’ లాంటి పీరియాడిక్‌ సినిమా చేసి ఉండటం, ప్యాన్‌ ఇండియా సూపర్‌స్టార్‌ అపీల్‌ ఉండటం.. ఇలా అన్ని విషయాల్లో ప్రభాసే పర్‌ఫెక్ట్‌ అని చిత్రబృందం ఆలోచన చేస్తోందట. మరి ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్‌ ఓకే అంటారా? వేచి చూడాలి.

మరిన్ని వార్తలు