నవంబర్‌ 18న ప్రభాస్‌ ‘జాన్‌’ షూటింగ్‌

8 Nov, 2019 18:06 IST|Sakshi

బాహుబలి సినిమాతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్.. ఆ తర్వాత సాహో సినిమా ద్వారా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. దీంతో కాస్త నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా జాన్‌పై దృష్టి సారించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ వేడుకను గతేడాది హైదరాబాద్‌లో నిర్వహించగా.. రెగ్యులర్‌ షూటింగ్‌ను 2018 డిసెంబర్‌ నుంచి ప్రారంభించాలని ప్లాన్‌ చేసుకుంది చిత్ర బృందం. కానీ ప్రభాస్‌ సాహో మూవీతో బీజీగా ఉండటంతో షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ‘సాహో’ షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌ నెక్ట్స్‌ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. విశ్రాంతి అనంతరం ‘జాన్‌’ షూటింగ్‌ సెట్‌లో ప్రభాస్‌ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. నవంబర్‌ 18 రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 

కాగా బాహుబలి ప్రభాస్‌ ఈ సినిమా విషయాన్ని ప్రారంభంలోనే తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు రాధకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 1970 కాలంలో సాగే ఈ చిత్రం మంచి రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అని, కొన్ని కీలక సన్నివేశాలను యూరప్‌లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నామని, రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పాడు. ఇక హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ.. జాన్‌లో హీరోయిన్‌గా సైన్‌ చేసిన తర్వాత షూటింగ్‌కు ప్రారంభం కాకముందే ముంబైలో ప్రభాస్‌, తాను ఈ సినిమాలోని కీలక సన్నిలవేశాలను గురించి చర్చించామని. అలాగే సన్నివేశాలలో ప్రాథమికంగా నటించామని చెప్పారు. గోపీ కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ  చిత్రానికి అమిత్‌ త్రివేదీ మ్యూజిక్‌ను అందించనున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’

సీఎం జగన్‌పై నారాయణమూర్తి ప్రశంసలు

మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్న నితిన్‌, రష్మికా

అలా చేయనందుకు భారీ మొత్తం: నటి

‘నా నాలుక భాగాన్ని కత్తిరించారు’

హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ

బన్నీ ట్వీట్‌.. రిలీజ్‌ డేట్‌ మారినట్టేనా?

తిప్పరా మీసం : మూవీ రివ్యూ

ఆ వార్తల్ని ఖండించిన యాంకర్‌ ప్రదీప్‌

భారతీయుడు-2: కమల్‌ కొత్త స్టిల్‌!!

ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చా: జాఫర్‌

శ్రీదేవి చిత్రం.. అరంగేట్రంలోనే ‘గే’ సబ్జెక్ట్‌తో

ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు 

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...

డబ్బే ప్రధానం కాదు

హాలీవుడ్‌ ఆహ్వానం

అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు

షూట్‌ షురూ

తీన్‌మార్‌?

మహేశ్‌ మేనల్లుడు హీరో

అరుణాచలం దర్బార్‌

యాక్టర్‌ అయినంత మాత్రాన విమర్శిస్తారా?

రాజీపడని రాజా

నిరంతర యుద్ధం

సారీ..!

రెండు ఊళ్ల గొడవ

అమలా పూల్‌

హారర్‌ బ్రదర్స్‌ బయోపిక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సల్మాన్‌ సినిమాలో ‘స్పైడర్‌ విలన్‌’

నవంబర్‌ 18న ప్రభాస్‌ ‘జాన్‌’ షూటింగ్‌

‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’

మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్న నితిన్‌, రష్మికా

అలా చేయనందుకు భారీ మొత్తం: నటి