ఆ సినిమాలో ప్రభాస్ లేడు

4 Oct, 2016 14:52 IST|Sakshi
ఆ సినిమాలో ప్రభాస్ లేడు

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, పలు సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నాడంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్సన్లో ప్రభాస్, ఓ చిన్న సీన్లో కనిపించటంతో మరిన్ని సినిమాల్లో కనిపించనున్నాడంటూ టాక్ మొదలైంది. ముఖ్యంగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న సింగం 3లో ప్రభాస్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

అయితే ఈ వార్తలపై స్పందించిన నిర్మాత జ్ఞానవేల్ రాజా, ప్రభాస్ సింగం 3లో నటించలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క శృతిహాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటున్న సింగం 3 డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా