డార్లింగ్స్‌... బర్త్‌డేకి కొత్త లుక్‌!

15 Oct, 2017 01:17 IST|Sakshi

బర్త్‌డే బాయ్‌ రెడీ... మీరూ (డార్లింగ్స్‌) రెడీనా? ఫ్యాన్స్‌తో సహా ప్రతి ఒక్కర్నీ ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ అనే పిలుస్తారు. వాళ్లందరికీ కొత్త లుక్కులో కిక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారీ హీరో. అక్టోబర్‌ 23న ప్రభాస్‌ బర్త్‌డే. ఇంకో వారం టైముంది! కానీ, ప్రభాస్‌ మాత్రం నిన్నే (శనివారం) ఓసారి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఎక్కడంటే... హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో! ఫొటోషూట్‌లో! ‘సాహో’ కోసం స్పెషల్‌ సెట్‌ వేశారక్కడ. అందులో ప్రభాస్‌ బర్త్‌డే కోసం స్పెషల్‌ ఫొటోషూట్‌ చేశారు. అంటే... ‘సాహో’లో ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ షూట్‌ అన్నమాట! ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ‘సాహో’లో ఆయన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ‘సాహో’ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ లుక్‌ చూశారా? గుర్తుంచుకోండి!
‘బాహుబలితో...’ అంటూ ఈ నెల 5న ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫొటో చూశారా? అయితే... గుర్తుంచుకోండి! ఎందుకంటే... ఆ రోజున ‘సాహో’ సెట్స్‌కి వెళ్లారామె. ఇది అప్పుడు తీసుకున్న ఫొటోనే! సో, సైనా ఫొటో దిగింది ‘బాహుబలి’తో కాదు, ‘సాహో’ షూటింగ్‌కి రెడీ అవుతోన్న ప్రభాస్‌తో. రేపు బర్త్‌డేకి విడుదల చేయబోయే లుక్‌లో ప్రభాస్‌ ఇంచుమించు ఈ హెయిర్‌ స్టైల్‌తోనే, ఈ లుక్కుతోనే ఉండొచ్చు. వెయిట్‌ అండ్‌ సీ!!

మరిన్ని వార్తలు