తీపి కబురు

9 Jul, 2020 02:21 IST|Sakshi
పూజా హెగ్డే, ప్రభాస్‌

అభిమానులకు ప్రభాస్‌ ఓ తీపి కబురు చెప్పారు. తన తాజా చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రేపు (శుక్రవారం) ఉదయం పదిగంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు  ‘ఓ డియర్‌’, ‘జాన్‌’, ‘రాధేశ్యామ్‌’ అనే టైటిల్స్‌ తెరపైకి వచ్చాయి. ఫస్ట్‌ లుక్‌ విడుదలైనప్పుడు టైటిల్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా