నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ – ప్రభాస్‌

29 Apr, 2020 02:50 IST|Sakshi

భారతీయ సినిమా చరిత్రలో ‘బాహుబలి’ది ఓ ప్రత్యేకమైన స్థానం. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, తమన్నా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించింది. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ పేరుతో రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. 2017 ఏప్రిల్‌ 28న విడుదలైన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వసూళ్ల రికార్డులను తిరగ రాసింది. ‘బాహుబలి 2’ విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు.

‘‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ దేశవ్యాప్తంగా ప్రజలు మెచ్చిన చిత్రమే కాదు.. నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌. ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నాకు అత్యంత చిరస్మరణీయంగా మలచిన దర్శకుడు రాజమౌళితో పాటు చిత్రబృందానికి, ఈ చిత్రాన్ని ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని పేర్కొని ఓ వర్కింగ్‌ స్టిల్‌ను షేర్‌ చేశారు ప్రభాస్‌. ‘‘నటుడిగా ఎంతో నేర్చుకుంటూ, ఎంజాయ్‌ చేస్తూ చేసిన సినిమా ఇది’’ అని రానా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు