‘సాహో’ రిలీజ్‌ తరువాత తొలిసారి మీడియాతో ప్రభాస్‌

15 Sep, 2019 13:05 IST|Sakshi

బాహుబలి తరువాత అదే స్థాయి అంచనాలతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా సాహో. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటింది. అయితే సినిమా రిలీజ్‌కు ముందు వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రభాస్‌ రిలీజ్‌ తరువాత మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారు.

సాహో రిలీజ్‌ అయిన రెండు వారాల తరువాత ప్రభాస్‌ మీడియా ముందుకు వచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో హిందీ సినిమాల పట్ల పక్షపాత ధోరణిపై ప్రభాస్‌ స్పందించాడు. ఇతర భాషల సినిమాలను బాలీవుడ్ జనాలు పెద్దగా ఆదరించరన్నా విషయాన్ని అంగీకరిస్తూనే, ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లో ఉన్నాయన్నాడు.

‘ప్రతి భాషలో అక్కడి ప్రాంతీయ నటులు ఉంటారు. వారు 20, 30 సంవత్సరాలుగా వారికి తెలుసు. అందుకే కొత్తగా వచ్చిన వారిని త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. కానీ సినిమా బాగుంటే ఇవ్వని పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. లేదంటే కొత్త నటుడికి, దర్శకుడికి అసలు అవకాశమే రాదు. బాహుబలి గతంలో ఉన్న ఎన్నో హద్దులను చెరిపేసి జాతీయ స్థాయి సినిమాలకు అవకాశం కల్పించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి’  అన్నారు.

సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన సాహో ఇప్పటికే 425 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డ్‌ల దిశగా దూసుకుపోతోంది. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్‌, చంకీ పాండే, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్ విజయ్‌, లాల్‌, వెన్నెల కిశోర్‌, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మరిన్ని వార్తలు