కాంబినేషన్‌ సై?

12 Oct, 2019 00:40 IST|Sakshi

స్టయిలిష్‌ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో సురేందర్‌ రెడ్డి స్పెషలిస్ట్‌. ఇటీవలే ‘సైరా’తో చారిత్రాత్మక సినిమాతోనూ హిట్‌ సాధించి తన సత్తా చాటారు. మరి సురేందర్‌ రెడ్డి నెక్ట్స్‌  ఏంటి? అంటే ప్రభాస్‌తో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ప్రభాస్‌కు సరిపోయే పాయింట్‌ సురేందర్‌రెడ్డి వద్ద ఉందని, త్వరలోనే కథకు సంబంధించిన చర్చలు కూడా జరగనున్నాయని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌ కుదిరితే మాత్రం మంచి స్టయిలిష్‌ సినిమాని ఊహించవచ్చని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మరి.. సురేందర్‌ రెడ్డి చెప్పనున్న కథ నచ్చి ప్రభాస్‌ ‘సై’ అంటే... ఈ కొత్త కాంబినేషన్‌ షురూ అయినట్లే.

మరిన్ని వార్తలు