రారండోయ్‌ వేడుక చేద్దాం

20 Nov, 2017 00:24 IST|Sakshi

పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. శుభలేఖలు పంచారు. తిరుపతిలో పెళ్లి మండపం బుక్‌ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురి కుటుంబాలు రారండోయ్‌ వేడుక చేద్దాం అని తిరుపతికి బయల్దేరాయి. అలకలు, బుజ్జగింపులు, సరదాలతో పెళ్లిసందడి మొదలైంది. అంతలో సడన్‌గా ఓ ట్విస్ట్‌. అంతే పెళ్లాగిపోయే పరిస్థితులు వచ్చాయట. ఆ ట్విస్ట్‌ ఏంటి? అసలు పెళ్లి జరిగిందా? అన్న ప్రశ్నలకు ఆన్సర్‌ కావాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకులు శక్తీ చిదంబరం.

ప్రభుదేవా, నిక్కీ గల్రానీ, అదా శర్మ ముఖ్యపాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. 15ఏళ్ల క్రితం చిదంబరం డైరెక్ట్‌ చేసిన ‘చార్లీ చాప్లీన్‌’ కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారన్నది కోలీవుడ్‌ సమాచారమ్‌. ప్రస్తుతం గోవాలో షూటింగ్‌ జరుగుతోంది. సాంగ్స్‌ షూట్‌ చేస్తున్నారు. ‘‘చార్లీ చాప్లీన్‌ 2’ సినిమాలో ప్రభుదేవాతో డ్యాన్స్‌ చేస్తున్నాను. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌. ఇక్కడ మరికొన్ని సాంగ్స్‌ను షూట్‌ చేసిన తర్వాత చెన్నైలో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాం’’అని పేర్కొన్నారు అదా శర్మ. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు