ఆయనకు ఇద్దరు..!

8 Nov, 2017 18:31 IST|Sakshi

నృత్య దర్శకుడు ప్రభుదేవా, నటుడు, దర్శకుడు అంటూ ఆల్ రౌండర్గా హోల్ ఇండియాను చుట్టేశారు. ప్రస్తుతం ఆయన నటనపై దృష్టి సారిస్తున్నారు. హీరోగా ఆయనకు దేవి చిత్రం మంచి రీఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రభుదేవా చేతిలో అరడజనుపైగా చిత్రాలు ఉన్నాయి. అంతేకాక మరిన్ని అవకాశాలు ముంగిట వాలడానికి రెడీగా ఉన్నాయి. ప్రభుదేవా ఇటీవలే ఒకే చెప్పిన చిత్రంలోనే ఇద్దరు ముద్దుగుమ్మలు  ఆయనతో రొమాన్స్ చేయడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం.

2002లో విడుదలైన చార్లీ చాప్లిన్ మంచి విజయాన్ని సాధించడంతోపాటు తెలుగు సహా ఆరు ఇతర భాషల్లో రీమేక్ అయ్యింది. ఆ చిత్రంలో ప్రభు, ప్రభుదేవా కలిసి నటించారు. వారికి జంటగా అభిరామి, గాయత్రి రఘురామ్ సీక్వెల్లోనూ నటించడంతోపాటు ప్రభు పాత్రను కూడా పోషించేస్తున్నట్లు సమాచారం. అంటే ద్విపాత్రాభినయం చేయనున్నారన్నమాట. ఆయనతో గ్లామర్ భామ నిక్కీగల్రాణి, తాన్యా రవిచంద్రన్లు రొమాన్స్ చేయనున్నారు.

తాన్యా రవిచంద్రన్ ఇటీవల కరుప్పన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను  సంపాదించుకున్నారు. క్రేజీమోహన్ మాటలను అందిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మాక్రియేషన్స్ టి.శివ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురువారం సాంగ్ చిత్రీకరణతో  గోవాలో ప్రారంభం కానుందని తెలిసింది.
 

మరిన్ని వార్తలు