జయంరవి, విజయ్‌సేతుపతిలతో ప్రభుదేవా చిత్రం

4 Jul, 2015 02:47 IST|Sakshi
జయంరవి, విజయ్‌సేతుపతిలతో ప్రభుదేవా చిత్రం

టాలీవుడ్,కోలీవుడ్,బాలీవుడ్ అంటూ దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ భారతీయ సినిమా పటంలో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన ప్రముఖ నృత్యదర్శకుడు,నటుడు ప్రభుదేవా.ఆయన తాజాగా నిర్మాతగా అవతారమెత్తనున్నారన్నది విశేషం అయితే,అది ఒక మల్టీస్టారర్ చిత్రం అన్నది మరో విశేషం.ప్రభుదేవా ఇంతకు ముందు జయంరవి హీరోగా ఎంగేయుం కాదల్ చిత్రానికి దర్శకత్వం వహించారన్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించనున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.

ఇందులో మరో హీరోగా విజయ్‌సేతుపతి నటించనున్నారట. జయంరవితో తాజాగా రోమియో జూలియట్ చిత్రంతో సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు లక్ష్మణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ఆ చిత్రానికి పని చేసిన ఛాయాగ్రహకుడు సౌందర్‌రాజన్, సంగీతదర్శకుడు డి.ఇమాన్ ఈ చిత్రానికి పని చేయనున్నారు,హీరోయిన్  ఎంపిక జరుగుతోందని త్వరలోనే చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.ఇది యాక్షన్ సన్నివేశాలతో కూడిన విభిన్న కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది.