ప్రదీప్‌ సినిమా మ్యూజికల్‌ పోస్టర్‌ వచ్చేసింది..

26 Jan, 2020 10:04 IST|Sakshi

బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్‌ మాచిరాజు. ప్రస్తుతం ప్రదీప్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు మ్యూజికల్‌ పోస్టర్‌ను శనివారం హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కు రానా విషెస్‌ చెప్పారు. ఈ వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్‌ చేసిన ప్రదీప్‌.. ‘సెలయేటి మధ్యలో ఆ పూల పరిమళం.. నీ నీలి కళ్ళలో నా ప్రేమ మధురం.. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా!’ అని ఓ కవితను ఉంచారు.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. మున్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అమ్రిత ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

27న గోపిచంద్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌
హీరో గోపిచంద్‌, డైరక్టర్‌ సంపత్‌ నంది కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోపిచంద్‌ హీరోగా ఇది 28వ సినిమా. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను జనవరి 27 ఉదయం 8.47 గంటలకు విడుదల చేయనున్నుట్టు చిత్రబృందం ప్రకటించింది. 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' బ్యానర్‌పై 'ప్రొడక్షన్ నెం.3' గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్నారు. గతంలో గోపిచంద్, సంపత్ నంది కలయికలో గౌత‌మ్ నంద చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా