ప్రదీప్‌ మాచిరాజు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

7 Mar, 2020 12:57 IST|Sakshi

బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమిృతా అయ్యర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించాడు. ఎస్వీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రదీప్‌ ఫాలోవర్స్‌కు చిత్ర బృందం తీపి కబురు తెలిపింది. ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’  చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా రిలీజ్‌ డేట్‌కు సంబంధించి పోస్టర్స్‌ను కూడా విడుదల చేశారు. 

ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్సందన వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటివరకు ఈ సాంగ్‌ 60 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. ఈ సాంగ్‌ను టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక మార్చి 25న విడుదల కాబోతున్న నాలుగు చిత్రం ఇది. అదే డేట్‌న నాని, సుధీర్‌ల ‘వి’, రాజ్‌ తరుణ్‌ ‘ఓరేయ్‌ బుజ్జిగా’,తో పాటు ‘అమృతరామమ్‌’ చిత్రాలు రీలీజ్‌ కానున్నాయి. 


చదవండి:
‘ప్రదీప్‌’ పాటకు నెటిజన్లు ఫిదా
‘ఎవరీ కుంజాలి.. చూసిన వాళ్లు బతికిలేరు’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు