మంచి కథతో వస్తున్నాం

12 Mar, 2020 05:39 IST|Sakshi
అనూప్, యస్‌.వి. బాబు, మున్నా, ప్రదీప్, అమృతా అయ్యర్‌

– ప్రదీప్‌

యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా, అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. యస్‌.వి. బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మున్నా మాట్లాడుతూ– ‘‘నేను ఎంసీఏ చదివే రోజుల్లో సుకుమార్‌గారి వద్ద పనిచేయాలనుకున్నా. ఆ తర్వాత ఆయన అసిస్టెంట్‌గా పని చేశాను. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కథని అల్లు అర్జున్‌గారికి,  ‘బన్నీ’ వాసుకి చెప్పాను. వారు కొన్ని సలహాలిచ్చారు. ‘బన్నీ’ వాసు మా సినిమాని జీఎ2 పతాకంపై విడుదల చేస్తున్నందుకు థ్యాంక్స్‌’’ అన్నారు.

ప్రదీప్‌ మాచిరాజు మాట్లాడుతూ– ‘‘హీరోలు మహేశ్‌బాబు, రానా, హీరోయిన్లు కాజల్‌ అగర్వాల్, తమన్నా మా సినిమాని సపోర్ట్‌ చేయడం ఆనందంగా ఉంది. అనూప్‌ మంచి సంగీతం ఇచ్చారు. మున్నా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి మనుషులు కలిసి చేసిన ఈ చిత్రం తప్పకుండా హిట్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాటకు మంచి స్పందన వచ్చింది. అనూప్‌ చక్కని సంగీతం ఇచ్చారు. చంద్రబోస్‌ మంచి సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు యస్‌.వి.బాబు. ‘‘ఇది నా తొలి చిత్రం. మంచి పాత్ర ఇచ్చినందుకు మున్నాకి థాంక్స్‌’’ అన్నారు అమృతా అయ్యర్‌. సహ నిర్మాత వినయ్, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్, కెమెరామెన్‌ శివ, ఆర్ట్‌ డైరెక్టర్‌ నరేష్‌ మాట్లాడారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు