విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?

2 Aug, 2019 14:47 IST|Sakshi

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడి విడాకులు తీసుకున్నారనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రకాశ్‌ - కనికా ధిల్లాన్‌ విడిపోయారంటూ ఆంగ్ల వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. వీరిద్దరు కలిసి పని చేసిన తాజా చిత్రం ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ షూటింగ్‌ ప్రారంభానికి ముందే ఈ జంట విడిపోయినట్లు సమాచారం‌. విడిపోయి రెండేళ్లు అవుతున్నా.. సినిమా కోసం కలిసి పని చేశారంటూ ప్రచారం జరుగుతుంది. ‘‘జడ్జిమెంటల్‌ హై క్యా’ చిత్రం షూటింగ్‌ కంటే ముందే.. అంటే 2017లోనే మేం విడిపోయాం’ అంటూ ఇద్దరు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేసినట్లు ఇండియాటుడే ఓ వార్త ప్రచురించింది.

ఈ విషయం గురించి ప్రకాశ్‌ కోవెలమూడి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యాను. కనికా మాత్రం రెండేళ్ల క్రితమే ముంబై షిప్ట్‌ అయ్యింది’ అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై కనికా ఎక్కువగా స్పందించలేదని తెలుస్తోంది. ‘విడిపోయారు కదా.. కలిసి పని చేస్తారా’ అని విలేకరులు ఆమెను ప్రశ్నించగా.. ‘తప్పకుండా. జడ్జిమెంటల్‌ హై క్యా సినిమా కోసం కలిసి పని చేశాం.. విజయం కూడా సాధించాం కదా. తప్పకుండా మరో ప్రాజెక్ట్‌ కోసం కలిసి పని చేస్తామని’ కనికా పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో వీరిద్దరి నుంచి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా కంగనా రనౌత్, రాజ్‌కుమార్‌ రావు ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి  ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహించగా, కనికా కథా సహకారం అందించారు. వీరిద్దరూ 2014లో వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌

ఉప్పెనలో ఉన్నాడు

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే

ఆటకి డేట్‌ ఫిక్స్‌

స్కెచ్‌ కంప్లీట్‌

చరిత్ర మరచిపోయిన లీడర్‌

రొమాంటిక్‌ సీన్స్‌ అంటే కష్టం

బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కష్టపడాల్సిందే

దౌడు తీయిస్తా

అషూకు సిగ్గు, శరం లేదు : తమన్నా

కెప్టెన్‌ లేకుండానే నడుస్తోంది!

దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు వచ్చేస్తున్నారు

‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌ లుక్‌

తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

ఏం కలెక్షన్లురా బై..!

‘ఆమె హీరోయిన్‌గా పనికి రాదు’

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌

దంగల్‌ దర్శకుడికి షాక్‌ ఇచ్చిన ఆమిర్‌ ఖాన్‌

‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్‌ ఎప్పుడంటే!

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం