క‌రోనా: నెటిజ‌న్ల‌కు ప్ర‌కాష్‌రాజ్ సూచ‌న‌

26 Mar, 2020 12:45 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పలు రంగాలకు చెందిన ప్రముఖలు వారికి తోచిన విధంగా వైరస్‌ను కట్టడిచేసేందుకు ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అంతేగాక క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పలు విధాలుగా ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ ప్ర‌ముఖులు ప‌వ‌న్ కల్యాణ్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ వంటి వారు క‌రోనాను అరిక‌ట్ట‌డానికి విరాళాలు ప్రకటించారు. వీరితోపాటు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ త‌న సంస్థ‌లో ప‌నిచేసే సిబ్బందికి మే నెల వ‌ర‌కు జీతాల‌ను ముందుగానే చెల్లించి ఉదార భావాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ప్ర‌కాష్‌రాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ట్విట‌ర్ వేదిక‌గా ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చారు. (75 లక్షలు విరాళమిచ్చిన రామ్‌చరణ్‌)

ప్ర‌కాష్‌రాజ్ ట్వీట్‌ చేస్తూ.. ‘నా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఖమ్మం, పాండిచ్చేరి, చెన్నై నుంచి వ‌చ్చిన 11 మంది కార్మికుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించాను. ఇది ప్ర‌భుత్వం బాధ్యత మాత్ర‌మే కాదు. దేశ పౌరులుగా మ‌న బాధ్య‌త కూడా. మానవ‌త్వాన్ని చాటుదాం.. ఐక్య‌త‌తో పోరాడుదాం’ అంటూ పిలుపునిచ్చారు. అలాగే దేశంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ‘విలువైన స‌మ‌యాన్ని పొలంలో గడుపుతున్నాను. కూర‌గాయ‌లు కోయ‌డం. వంట చేయ‌డం వంటి ప‌నులు చేస్తున్నాను. మీరు కూడా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించండి. ఇంట్లోనే ఉండండి. స‌మిష్టిగా పోరాడుదాం అంటూ  నెటిజ‌న్ల‌’కు సూచించారు. దీనికి కుటుంబ స‌భ్యులు పొలంలో చేస్తున్న ప‌లు ఫోటోల‌ను షేర్ చేశారు. (కరోనా బాధితులకు పవన్ కల్యాణ్‌ విరాళం)

మరిన్ని వార్తలు