నిజమైన ప్రేమ

7 Mar, 2020 05:53 IST|Sakshi
సోనాక్షీ వర్మ, జీపీయస్

జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్‌ రామకృష్ణ (ఆర్‌.కె) నిర్మాత.  మురళీ రామస్వామి (యం.ఆర్‌) దర్శకుడు. ‘‘మా సినిమాను ఈ నెల 13న విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. యం.ఆర్‌. మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాకి మంచి హైప్‌ వచ్చింది. ఇటీవల మా సినిమా యూనిట్‌తో పాటు కొంతమంది యూత్‌కు సినిమా చూపించాం. అందరూ ఇప్పటి ట్రెండ్‌కన్నా అడ్వాన్డ్స్‌గా ఉందన్నారు. నిజమైన ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’’ అన్నారు. ‘‘ట్రైలర్‌కు, ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు బజ్‌ వచ్చింది. త్వరలోనే మిగతా పాటలను విడుదల చేస్తాం. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీపీయస్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు