దేవత వచ్చింది

25 Jan, 2020 00:29 IST|Sakshi
ప్రసన్న, స్నేహ

శుక్రవారం నటి స్నేహ ఇంట్లో ఆనందం రెండింతలయింది. ఆమె రెండోసారి తల్లి కావడమే అందుకు కారణం. శుక్రవారం ఓ పాపకు జన్మనిచ్చారు స్నేహ. ‘దేవత వచ్చింది’ అంటూ  ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేశారు స్నేహ భర్త ప్రసన్న. 2012లో తమిళ నటుడు ప్రసన్న, స్నేహ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2015 ఆగస్ట్‌లో స్నేహ ఓ బాబుకి జన్మనిచ్చారు. కుమారుడికి విహాన్‌ అని పేరు పెట్టారు.
 

మరిన్ని వార్తలు