ఎన్టీఆర్‌తో సినిమాపై కేజీఎఫ్‌ దర్శకుడి క్లారిటీ

20 May, 2020 13:19 IST|Sakshi

కేజీఎఫ్‌ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఈ చిత్రంలో కన్నడ హీరో యష్‌ను అద్భుతంగా చూపించిన ప్రశాంత్‌.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 తెరకెక్కిస్తున్న ప్రశాంత్‌.. ఆ చిత్రం పనులు తుది దశకు చేరుకోవడంతో తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. నేడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్బర్త్‌డే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్‌.. తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. (చదవండి : బెస్ట్‌ గిఫ్ట్‌ ఇస్తాను : చరణ్‌)

‘న్యూక్లియర్‌ ప్లాంట్‌ పక్కన కూర్చుంటే ఆ ఫీల్‌ ఎలా ఉంటుందో ఫైనల్‌గా నాకు తెలిసింది. నీ చుట్టూ ఉండే క్రేజీ ఎనర్జీకి నెక్ట్స్‌ టైమ్‌ నా రేడియేషన్‌ సూట్‌ని‌ తీసుకువస్తాను. హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌’ అని పేర్కొన్నారు. దీంతో ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ కాంబినేషన్‌లో సినిమా ఖరారైనట్టుగా అభిమానులు భావిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం  2022లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చేస్తున్న ఎన్టీ​ఆర్‌.. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అది పూర్తి అయిన తర్వాత ప్రశాంత్‌ నీల్‌‌ చిత్రం మొదలు కానున్నట్టుగా సమాచారం. కాగా, కొద్ది కాలంగా ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతునే సంగతి తెలిసిందే. (చదవండి : తారక్‌కు బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌‌ స్పెషల్‌ విషెస్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా