డిజిటల్‌ చార్జీలు తగ్గించాల్సిందే

27 Dec, 2017 00:08 IST|Sakshi
ప్రతాని రామకృష్ణగౌడ్, సాయివెంకట్‌

డిజిటల్‌ రేట్స్‌ అండ్‌ థియేటర్స్‌ లీజ్‌ విధానంపై ఇండస్ట్రీకి అనుకూలంగా మార్చి 31లోపు సరైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ను మూసివేయడంతోపాటు, షూటింగ్‌లను బంద్‌ చేయాలనుకుంటున్నట్లు ఇటీవల తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నిర్ణయానికి తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్, వైస్‌ ప్రెసిడెంట్‌ అలీఖాన్, నిర్మాత సాయివెంకట్‌ మద్దతు తెలిపారు. మంగళవారం పాత్రికేయుల సమావేశంలో ప్రతాని మాట్లాడుతూ– ‘‘తమిళనాడు, కర్ణాటక, ముంబైలలో డిజిటల్‌ చార్జీలు వారానికి 2500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో 13వేలు వసూలు చేస్తున్నారు. ఈ విధానంలో మార్పు రావాలి’’ అన్నారు.  ‘‘ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’’ అన్నారు సాయి వెంకట్‌. 

మరిన్ని వార్తలు