ఈఎమ్‌ఐ నేపథ్యంలో...

12 Oct, 2019 00:32 IST|Sakshi
భానుశ్రీ

నోయల్, భానుశ్రీ జంటగా దొంతు రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈఎమ్‌ఐ’. దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రసన్నకుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దొంతు రమేష్‌ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ఇది. బ్యాంకాక్‌లో కొన్ని పాటలు చిత్రీకరించనున్నాం. దాంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది.

మా సినిమా చూసిన తర్వాత నచ్చలేదు అనే వాళ్ల ఈఎమ్‌ఐ నేను చెల్లిస్తాను’’ అన్నారు. ‘‘నెలవారీ వాయిదాలు చెల్లించలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది’’ అన్నారు భానుశ్రీ. ‘‘ప్రస్తుతం ఈఎమ్‌ఐ అంటే తెలియనివారుండరు. ఆ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే కథ ఇది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు