ప్రతానికి డాక్టరేట్‌

16 Jun, 2018 01:28 IST|Sakshi

తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌  ‘యునైటెడ్‌ ధియోలాజికల్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ’ (యుటిఆర్‌) నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ బర్కిలీకి అనుబంధంగా గుర్తింపు పొందిన యుటిఆర్‌ యూనివర్సిటీ రామకృష్ణ గౌడ్, నటుడు సుమన్‌లను గౌరవ డాక్టరేట్‌కి ఎంపిక చేసింది.

హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య, తెలంగాణ  శాసన మండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ చేతుల మీదుగా రామకృష్ణ గౌడ్‌ గౌరవ డాక్టరేట్, 51వేల నగదు అందుకున్నారు. ఐదు వేల మంది సినీ కార్మికులకు హెల్త్‌ కార్డ్స్, ఐదు లక్షల ఉచిత బీమా కల్పించడంతో పాటు రెండు వందల మంది సినీ వర్కర్లకు గృహాలు ఇప్పించారు ప్రతాని. సినిమారంగంలో ఆయన చేసిన సోషల్‌ సర్వీస్‌కి గాను ఈ డాక్టరేట్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రతానికి అభినందనలు తెలిపారు. ‘‘గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం ఆనందంగా ఉంది’’ అని ప్రతాని అన్నారు.

మరిన్ని వార్తలు