ఏడాది చివర్లో పండగ

17 Oct, 2019 01:59 IST|Sakshi
సాయి తేజ్, రాశీ ఖన్నా

సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఎస్‌కేఎన్‌ సహ–నిర్మాత. ఈ సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం వెల్లడించింది. ‘‘కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారు మారుతి. సాయి తేజ్‌కు తాతయ్య పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్‌ నటిస్తున్నారు. రావురమేష్‌గారిది కీలక పాత్ర. సాయి తేజ్‌ను కొత్త పాత్రలో చూడబోతున్నారు. ఈ సినిమాలో తాత–మనవడి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కటుంబ విలువలు, ఆప్యాయతలతో ఈ సినిమా మంచి ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా