ప్రతిరోజూ పండగే హిట్‌ అవుతుంది

17 Dec, 2019 00:13 IST|Sakshi
సత్యరాజ్, సాయి తేజ్, రాశీ ఖన్నా, అల్లు అరవింద్, మారుతి, వంశీ, ‘బన్ని’ వాసు

– అల్లు అరవింద్‌

‘‘సందేశాన్ని కూడా ఆహ్లాదకరంగా చెప్పే ప్రతిభ ఉన్న వ్యక్తి మారుతి. ఆడియ¯Œ ్స పల్స్‌ తెలిసిన డైరెక్టర్‌ తను. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని మా యూనిట్‌ అంతా నమ్మకంగా ఉన్నాం. సాయితేజ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన అందరూ బాగా చేశారు. యు.వి. క్రియేషన్స్‌ వంశీ, నేను కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. బన్నీ వాసు కష్టపడి నిర్మించాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’.

అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–‘‘ వాసు, మారుతి, యూవీ వంశీ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి. ఈ చిత్ర కథను మారుతి మొదటిసారి నాకే చెప్పాడు.. బాగా నచ్చింది. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ‘శతమానం భవతి’ సినిమా అంత పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు. సాయి తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఫ్యా¯Œ ్స ఉంటే మాకు ప్రతిరోజూ పండగే. నాకు ఎప్పుడూ అండగా నిలబడింది మెగా ఫ్యా¯Œ ్స. చిరంజీవిగారితో పాటు అభిమానుల ఆశీర్వాదాలు మా యూనిట్‌కి ఉండాలని కోరుకుంటున్నా.

సినిమా చూశాక ప్రేక్షకులు నిరుత్సాహ పడరనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నా టీమ్‌కి థ్యాంక్స్‌. తమన్‌ మంచి పాటలిచ్చాడు. ‘బన్ని’వాసు, ఎస్‌.కె.ఎన్, ఏలూరు శ్రీను సహకారం మరువలేనిది. చిరంజీవిగారికి కథ చెప్పినప్పుడు నచ్చింది.. ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన ఆయన మెచ్చుకున్నారు’’ అన్నారు మారుతి. ‘‘గీతా ఆర్ట్స్‌లో చేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది’’ అన్నారు రాశీఖన్నా.  ‘‘నా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వచ్చిన ఒక బెస్ట్‌ రోల్‌ ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నటుడు నరేష్‌. ‘‘సాయి తేజ్‌  చాలా హార్డ్‌ వర్కర్‌. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లో ఉన్న లక్షణాలు అతనిలో ఉన్నాయి’’ అన్నారు నటుడు సత్యరాజ్‌. ఈ వేడుకలో ‘బన్ని’ వాసు, సహ నిర్మాత ఎస్‌.కె.ఎన్, నటుడు రావు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే తెలుగులో వీలు కుదర్లేదు

మత్తు వదిలించే కింగ్‌ఫిషర్‌

తూటా వస్తోంది

పాత బస్తీలో డిష్యుం డిష్యుం

తెలుగు రాష్ట్రంలో తలైవి

‘తానాజీ’ నుంచి మరో ట్రైలర్ విడుదల

అదిరిపోయిన ‘దర్బార్‌’ ట్రైలర్‌

జీజాజీ ఆగయా.. మీ అభిమానానికి ధన్యవాదాలు

ఆ హీరోలను వెనక్కి నెట్టిన విజయ్‌ దేవరకొండ

‘హి ఈజ్ సో క్యూట్’ అంటూ మహేష్‌ను ఆడుకుంటున్న రష్మిక

పౌరసత్వ రగడ: నటి ఆవేదన

క్వీన్‌ రివ్యూ: అందరి మనసులో ‘అమ్మ’

లెక్కకు మించి వసూళ్లు చేస్తున్న చిత్రం

ఆ బాలీవుడ్‌ నటికి బెయిల్‌ నిరాకరణ

అల్లు అరవింద్‌ డాన్స్‌ అదుర్స్‌

మా అసోషియేషన్‌ ఎక్కడ..?

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వెంకీమామ

నేడు పోలీసుల ముందు హాజరుకానున్న వర్మ

మాజీ భార్యతో కలిసి స్టార్‌ హీరో సందడి

దిశ చట్టం తెచ్చిన సీఎం జగన్‌కు జేజేలు

బాలరాజు కబుర్లు

ఆ స్ఫూర్తితోనే రూలర్‌ చేశాం

నాకు ఆ అలవాటు లేదు

నచ్చిన సినిమాలే చేస్తాను

పింక్‌ రీమేక్‌లో అంజలి?

స్ట్రైకింగ్‌కి సిద్ధం

మరికొన్ని సెటైరికల్‌ చిత్రాలు తీస్తాను

అత్తగారూ కోడలూ

రామ్‌ గోపాల్‌ వర్మకు నోటీసులు

‘ఎవడ్రా హీరో’ సినిమా హీరో అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే తెలుగులో వీలు కుదర్లేదు

మత్తు వదిలించే కింగ్‌ఫిషర్‌

తూటా వస్తోంది

పాత బస్తీలో డిష్యుం డిష్యుం

తెలుగు రాష్ట్రంలో తలైవి

‘తానాజీ’ నుంచి మరో ట్రైలర్ విడుదల