మీడియాపై ప్రీతి జింటా సెటైర్!

19 Jun, 2014 15:35 IST|Sakshi
మీడియాపై ప్రీతి జింటా సెటైర్!
ముంబై: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో తన వాటాను అమ్మడం లేదని బాలీవుడ్ తార ప్రీతిజింటా స్పష్టం చేశారు. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీలో సహ భాగస్వామి నెస్ వాడియాపై ప్రీతి జింటా లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను యూఎస్ స్థిరపడనున్నట్టు మీడియాలో వస్తున్న రూమర్లను ప్రీతిజింటా తోసిపుచ్చారు. 
 
మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ప్రీతి జింటా ఆసంతృప్తిని వ్యక్తం చేసింది. నేను నా వాటాను అమ్మడం లేదు. అమెరికాలో స్థిరపడటం లేదు అని ప్రీతిజింటా ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. తన జీవితం గురించి మీడియా ఊహజనిత కథనాలను రచించడం నచ్చడం లేదని ఆమె అన్నారు. వాస్తవాలకు దూరంగా ఉండే కథనాలతో వార్తలు అందించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తన జీవితంలో విషయాలకంటే.. భారతదేశంలో ఎన్నో అతిముఖ్యమైన అంశాలను రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది అని మీడియాపై ఎద్దేవా చేశారు. లైంగికంగా వేధించారని తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై ప్రీతిజింటా జూన్ 12 తేదిన ఫిర్యాదు చేశారు.