ప్రీతి జింటా పోలీసులకు అంతా చెప్పేసింది!

25 Jun, 2014 18:44 IST|Sakshi
ప్రీతి జింటా పోలీసులకు అంతా చెప్పేసింది!
ముంబై: తనకు, మాజీ బాయ్ ఫ్రెండ్, వ్యాపార భాగస్వామి నస్ వాడియాకు తనకు మధ్య జరిగిన ఎపిసోడ్ ను బాలీవుడ్ నటి ప్రీతి జింటా పోలీసులకు వివరించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రెండుగంటలకు పైగా సాగిన విచారణలో అన్ని వివరాలు ప్రీతి వెల్లడించిందని పోలీసు అధికారులు తెలిపారు. 
 
జూన్ 12 తేదిన నెస్ వాడియాపై దాఖలు చేసిన ఆరోపణలపై పోలీసులు స్టేట్ మెంట్ ను మంగళవారం రికార్డు చేశారు. తనను దూషించిన విధానాన్ని, తనపై ఎలా అరిచాడో, తనను నిందించిన వైనాన్ని,  దాడి చేసిన తీరును పోలీసులకు వివరంగా ప్రీతి జింటా తెలిపినట్టు అధికారులు తెలిపారు. 
 
ఆ రోజు జరిగిన ఘటనలో తనను పదే పదే హెచ్చరించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్టు ప్రీతి చెప్పిన స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. 'స్పాట్ పంచనామా'లో భాగంగా వాంఖెడే స్టేడియంలో మే 30 తేదిన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా నెస్ వాడియాతో కలిసి కూర్చున్న ప్రదేశాన్ని ప్రీతిజింటా  పోలీసులకు చూపించారు. 
 
వాంఖెడే స్టేడియానికి తన సోదరుడితో కలిసి పోలీసులకు వివరాల్ని అందించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రీతి జింటా ఫిర్యాదులో పేర్కొన్న మరో 14 మందిని పోలీసులు ప్రశ్నించనున్నారు.