‘ఇప్పుడు మాత్రం క్రికెట్‌ అంటే పిచ్చి’

12 Apr, 2019 11:47 IST|Sakshi

‘జీవితంలో కచ్చితంగా నిలకడగా ఉండేది ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే. ఒకప్పుడు హాకీ నేర్చుకునేందుకు చాలా ఇష్టపడేదాన్ని.. ప్రస్తుతం క్రికెట్‌కు పిచ్చి అభిమానినయ్యాను. కాలంతో పాటు మనమూ మారిపోతాం కదా’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘కాలం మారినా మీరు మాత్రం అలాగే ఉన్నారు. హాకీ అభిమానిగా ఉన్న మీరు క్రికెట్‌ను ఆరాధించడంతో పాటుగా ఐపీఎల్‌లో కింగ్స్‌ జట్టుతో మాకు వినోదాన్ని పంచుతున్నందుకు థాంక్స్‌’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

కాగా దిల్‌ సే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి జింటా.. ఆ తర్వాత సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఐపీఎల్‌ జట్టు సహ యజమానిగా ఉన్న ఆమె.. తన కింగ్స్‌ గ్యాంగ్‌తో మైదానంలో సందడి చేస్తారు. జట్టు విజయం సాధించినపుడు భాంగ్రా స్టెప్పులేస్తూ ఉత్సాహపరచడంతో పాటు.. ఓడినపుడు కూడా ఆటగాళ్లకు అండగా నిలుస్తారు. కాగా ప్రస్తుతం టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సారథ్యంలోని కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు ఇంతవరకు టైటిల్‌ గెలిచిన దాఖలాలు లేవు. డ్యాషింగ్‌ హిట్లర్లు, స్టార్‌ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రీతి టీమ్‌కు ఐపీఎల్‌ కప్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

The only thing constant in life is change. एक वक़्त था जब मैं हॉकी सीख रही थी - आज मैं क्रिकेट की दीवानी हूँ ! वक़्त के साथ हम भी बदल जाते हैं 🤩 #throwbackthursday #tbt #ting #throwback #thursdaythoughts

A post shared by Preity G Zinta (@realpz) on

మరిన్ని వార్తలు