ప్రేమదేశం ప్రారంభం

19 Jun, 2018 00:58 IST|Sakshi
మాయ, అజయ్, ఆకాశ్‌ పూరి

‘నను నేనె మరచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు.. వినిపించదా ప్రియా నా గోడు.. ప్రేమా’ పాట వినగానే టక్కున ‘ప్రేమదేశం’ సినిమా గుర్తుకు రాకమానదు. అబ్బాస్, వినీత్, టబూ ప్రధాన పాత్రల్లో 1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ ఎంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడు ‘ప్రేమదేశం’ పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది.

అజయ్, మాయ జంటగా శ్రీకాంత్‌ శిద్ధం దర్శకత్వంలో సిరి క్రియేషన్స్‌ వర్క్స్‌ పతాకంపై శిరీష, నీలిమ తిరుమల్‌ శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటి జీవితా రాజశేఖర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో ఆకాష్‌ పూరి క్లాప్‌ ఇచ్చారు. ఆనంద్‌ రవి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీత దర్శకునిగా, శేఖర్‌ గంగాణమోని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిషోర్, అజయ్‌ కతుర్వ, మాయ, శివకుమార్‌ రామచంద్రవరపు, వైశాకి నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు