నిజమైన ప్రేమంటే?

12 Mar, 2020 05:44 IST|Sakshi
కపిలాక్షి మల్హోత్రా, జీపీయస్‌

‘‘ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించకూడదు? నిజమైన ప్రేమంటే ఎలా ఉంటుంది? అని మా మా సినిమాలో చూపించాం’’ అన్నారు మురళీ రామస్వామి. జీపీయస్‌ హీరోగా, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరోయిన్లుగా మురళీ రామస్వామి (యం.ఆర్‌) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌పై పి.ఎస్‌ రామకృష్ణ(ఆర్‌.కె) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో మురళీ రామస్వామి మాట్లాడుతూ– ‘‘జీపీఎస్‌ నాకు మంచి మిత్రుడు.

ఈ సినిమాను తన నటనతో నిలబెట్టాడు. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రకథ నచ్చడంతో ముగ్గురు మిత్రులతో కలిసి నిర్మించాను. మా చిత్రాన్ని ‘అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలతో పోలుస్తున్నారు. అలాంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలతో పోల్చడం మంచిదే కానీ, మా సినిమా కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది. ఇకపై వచ్చే సినిమాలను ‘ప్రేమ పిపాసి’లా  ఉందంటారు’’ అన్నారు పిఎస్‌ రామకృష్ణ. ‘‘మా చిత్రం గురించి మేం మాట్లాడటం కాదు. ఈ నెల 13న  మా సినిమానే మాట్లాడుతుంది’’ అన్నారు జీపీఎస్‌. ‘‘పాటలు, పతాక సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్స్‌’’ అన్నారు మరో నిర్మాత రాహుల్‌ భాయ్‌. సినిమాటోగ్రాఫర్‌ తిరుమల రోడ్రిగ్జ్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ, పాటల రచయితలు సురేష్‌ గంగుల, అలా రాజు తదితరులు మాట్లాడారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు