బుంగమూతి పిల్ల

25 Dec, 2019 06:46 IST|Sakshi

ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పిపాసి’. మురళీ రామస్వామి దర్శకత్వంలో పి.ఎస్‌.రామకృష్ణ  నిర్మిస్తున్నారు. జీపీఎస్, కపిలాక్షీ మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లు. ఈ చిత్రంలోని ‘బుంగమూతి పిల్లదాన’ అనే పాటను విడుదల చేశారు. ‘‘ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు పీఎస్‌ రామకృష్ణ. ‘‘బుంగమూతి పిల్ల..’ పాటకు ఆర్స్‌గారు అద్భుతమైన ట్యూన్‌ ఇస్తే.. సురేష్‌ ఉపాధ్యాయ మంచి లిరిక్స్‌ ఇచ్చారు’’ అన్నారు మురళీ రామస్వామి. ‘‘టీజర్‌కు మంచి∙స్పందన వచ్చింది.  సోషల్‌ మీడియాలో డైలాగ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి’’ అన్నారు జీపీయస్‌. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్స్‌: రాహుల్‌ పండిట్, జీఎస్‌ రావు, వై. వెంకటలక్ష్మి, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: యుగంధర్‌ కొడవటి.

మరిన్ని వార్తలు