మా కష్టాన్ని గుర్తించారు

3 Sep, 2018 06:24 IST|Sakshi

‘‘నాది విజయనగరం దగ్గర సాలూర్‌.   యూకేలో చదువుకున్నా. ముంబైలోని బ్యారిజాన్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో ఆరు నెలలు శిక్షణ తీసుకున్నా. నటుడిగా నా తొలిచిత్రం ‘ప్రేమకు రెయిన్‌ చెక్‌’. చిన్నప్పటి నుంచి   మహేశ్‌బాబుగారి సినిమాలు ఎక్కువగా చూస్తూ పెరిగాను’’ అని అభిలాష్‌ అన్నారు. అభిలాష్‌ మాడాడ, ప్రియ, తన్య హీరో హీరోయిన్లుగా స్టోన్‌ మీడియా ఫిల్మ్‌ పతాకంపై ఆకెళ్ళ పేరి శ్రీనివాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ప్రేమకు రెయిన్‌ చెక్‌’. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా అభిలాష్‌ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. రెయిన్‌ చెక్‌ అంటే భవిష్యత్తులో పూర్తయ్యే ప్రమాణం. మా అదృష్టం ఏంటంటే మా చిత్రనికి డైరెక్టర్, నిర్మాత ఒక్కరే కావడం. ‘ప్రేమకు రెయిన్‌ చెక్‌’ అన్నది ఆయన విజన్‌. అందుకు తగ్గట్టే బాగా తెరకెక్కించారు. నిర్మాత శరత్‌ మరార్‌గారికి మా సినిమా బాగా నచ్చడంతో సమర్పిస్తున్నారు. మా కష్టాన్ని గుర్తించారనిపించింది. ఎలాంటి పాత్ర అయినా న్యాయం చేయాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు