అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా?

16 Jun, 2019 02:59 IST|Sakshi
సుజై, సాయి రోనక్, ప్రీతి అష్రాని, సుశీల్, అప్పి రెడ్డి

సాయి రోనక్, ప్రీతి అష్రాని హీరో హీరోయిన్లుగా సుజై, సుశీల్‌ నిర్మించి, రచించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రెజర్‌ కుక్కర్‌ ’. ఎ. అప్పిరెడ్డి మరో నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత డి. సురేశ్‌బాబు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ములైన సుజై, సుశీల్‌ యూఎస్‌ నుండి ఇండియాకు సినిమాలు చేయాలనే ప్యాష¯Œ తో వచ్చారు. చాలా క్లారిటీతో క్లియర్‌గా సినిమా తీశారు. టిపికల్‌ థాట్స్‌తో వస్తున్న ఇలాంటి కొత్తవారిని తప్పకుండా ఎంకరేజ్‌ చేయాలి. డిఫరెంట్‌ టైటిల్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

సుజై మాట్లాడుతూ– ‘‘పిల్లల్ని ఇంజినీరింగ్‌ చదివించడం, తర్వాత అమెరికా పంపించడం అక్కడ సెటిల్‌ అయ్యారని చెప్పుకోవడమే పరమావధిగా భావిస్తున్న మధ్యతరగతి తెలుగు కుటుంబాలపై విసిరిన వ్యంగ్యాస్త్రమే ఈ మా ‘ప్రెజర్‌ కుక్కర్‌’. కిషోర్‌ అనే కుర్రాడు ఏం చేసి అయినా యూఎస్‌ వెళ్లాలనుకుంటాడు. అతడు పడ్డ కష్టాలు, ఆ క్రమంలో నేర్చుకున్న కొత్త పాఠాలు, అతనిలో పెరిగిన ఆత్మవిశ్వాసం, కుటుంబ విలువల పట్ల కొత్తగా ఏర్పడ్డ గౌరవం, దీంతో అసలు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా? అని అతనికి కలిగే సందేహం లాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపించడం జరిగింది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. సాయి రోనక్‌ మాట్లాడుతూ–  ‘‘నాకు అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్‌గారికి ధన్యవాదాలు. నేను రియల్‌ లైఫ్‌లో ఎదుర్కొన్న పరిస్థితులనే ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు. మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘రెండు సంవత్సరాలుగా కష్టపడి క్లారిటీతో స్టోరీని ప్రిపేర్‌ చేశారు. మంచి ఔట్‌ ఫుట్‌ ఇచ్చారు’’ అన్నారు. ‘‘మొదటిసారి నన్ను నేను సినిమా పోస్టర్‌లో చూసుకోవాలనే నా కల నెరవేరింది’’ అన్నారు ప్రీతి.

మరిన్ని వార్తలు