ఖైదీ జీవిత కథతో సినిమా

31 Jan, 2016 23:47 IST|Sakshi
ఖైదీ జీవిత కథతో సినిమా

జైలు జీవితం నటుడు  సంజయ్ దత్‌కు ఓ కథ ఇచ్చిందని సమాచారం. ఆ కథతో సినిమా చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అక్రమాయుధాల కేసులో జైల్లో ఉన్న సంజయ్ దత్  తన తోటి ఖైదీలతో చాలా స్నేహంగా ఉంటున్నారట. ఆ క్రమంలో ఓ ఖైదీ జీవితం సంజయ్‌ను ఆకర్షించిందని సమాచారం. కుటుంబ తగాదాల్లో శిక్ష అనుభవిస్తున్న ఆ ఖైదీ జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలని ఆయన అనుకుంటున్నారట. ఈ నెల 25న జైలు నుంచి విడుదల కానున్నారు సంజయ్ దత్. బయటకు వచ్చీ రాగానే ఈ ప్రాజెక్ట్ గురించి కసరత్తులు మొదలు పెట్టాలనుకుంటున్నారట.

ఈ చిత్రంలో నటించాలనుకుంటున్నారా? లేక కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనుకుంటున్నారా? అనే విషయం వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే... సంజయ్ దత్  ఇప్పటికే కొన్ని చిత్రాలు అంగీకరించారు. వాటిపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నారట.