విక్రమ్‌తో ప్రియా ఆనంద్

5 Oct, 2014 01:13 IST|Sakshi
విక్రమ్‌తో ప్రియా ఆనంద్

సియాన్ విక్రమ్ సరసన నటించే లక్కీ చాన్స్‌ను నటి ప్రియా ఆనంద్ కొట్టేసింది. ఈ చిత్రంలో విక్రమ్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధం అని కూడా ఈ అమ్మడు చెప్పిందట. తొలిరోజుల్లో ఐరన్‌లెగ్ హీరోయిన్‌గా ముద్రపడిన ఈ బ్యూటీ శ్రీదేవితో కలిసి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత శివకార్తికేయన్‌తో జత కట్టిన ఎదిర్‌నీచ్చల్ చిత్రం కోలీవుడ్‌లో సక్సెస్ రుచి చూపించింది. ఆ తరువాత వణక్కం చెన్నై, అరిమానంబి వంటి చిత్రాలు ఈ ముద్దుగుమ్మ స్థాయిని పెంచుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం విమల్‌కు జంటగా ఒరు ఊర్ల రెండు రాజా చిత్రంలో నటించింది.
 
 ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కాగా అరిమానంబి చిత్రంలో మద్యం తాగి హీరోతో పోటీ పడిన ప్రియా ఆనంద్ పలువురి విమర్శలకు గురైంది. అయినా వాటిని లెక్క చేయకుండా మద్యాన్ని మగవారు తాగితే ఒప్పు, ఆడవారు సేవిస్తే తప్పా? అంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేసింది. అయినా అమ్మడికి కోలీవుడ్‌లో అవకాశాలు రావడం విశేషం. నటుడు విక్రమ్ నటించనున్న నూతన చిత్రంలో నటించే అవకాశం ప్రియా ఆనంద్‌కు వరించింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. అందాలారబోయడానికి ఏ మాత్రం వెనుకాడని ప్రియా ఆనంద్ అవసరం అయితే హీరో విక్రమ్‌తో లిప్‌లాక్ సన్నివేశాలలో నటించడానికి సిద్ధమేనని కథ వినిపించడానికి వచ్చిన దర్శకుడితో చెప్పిందట. పెద్ద హీరోతో నటించే అవకాశం ఎక్కడ జారిపోతుందోనన్న ముందుచూపుతోనే ప్రియా ఆనంద్ లిప్‌లాక్ ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి