నివీన్‌బాలితో జోడీ కట్టని అమలాపాల్‌

6 Dec, 2017 08:13 IST|Sakshi

తమిళసినిమా: నటి అమలాపాల్‌ మరోసారి హెడ్‌లైన్స్‌లోకెక్కింది.ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శకుడు విజయ్‌ నుంచి ఏడాదిలోనే విడిపోయి, విడాకులు పొందిన ఈ కేరళ జాణ మళ్లీ హీరోయిన్‌గా బిజీ అయ్యింది. ఇటీవల తిరుట్టుప్పయలే–2 చిత్రంలో బాబీసింహాతో శ్రుతిమించిన రొమాన్స్‌ సన్నివేశాల్లో నటించి చర్చకు తావిచ్చిన అమలాపాల్‌ అరవిందస్వామికి జంటగా నటించిన భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో ఈ అమ్మడు ఇద్దరు పిల్లలకు అమ్మగా నటించింది. మలయాళం, తమిళ్‌ భాషల్లో తెరకెక్కుతున్న ఒక చిత్రంలో నటించడానికి అంగీకరించి తాజాగా ఆ చిత్రం నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు జ్యోతిక ప్రధాన పాత్రలో 36 వయదినిలే వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన మలయాళ దర్శకుడు రోషన్‌ఆండ్రూస్‌ తాజాగా కాయం కుళం కొచ్చుణ్ణి (మలయాళ వెర్షన్‌ టైటిల్‌) పేరుతో ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో మలయాళ యువ క్రేజీ నటుడు నివీన్‌బాలి కథానాయకుడిగా నటిస్తున్నా రు. ఆయనకు జంటగా అమలాపాల్‌ను ఎంపిక చేశా రు. ఇది 1980లో కేరళలో జీవించిన ఒక గజదొంగ యథార్థ ఇతివృత్తంతో రూపిందిస్తున్న చిత్రం. ఇందులో హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందట. చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది.ఈ చిత్ర హీరోయిన్‌ గెటప్‌ అవుట్‌ లైన్‌ చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇలాం టి పరిస్థితుల్లో ఏమయ్యిందో ఏమోగానీ అనూహ్యంగా చిత్రం నుంచి అమలాపాల్‌ వైదొలిగినట్లు ప్రచారం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.అంతే కాదు ఇప్పుడీ పాత్రలో నటి ప్రియాఆనంద్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ అంశంపై అమలాపాల్‌ నోరు విప్పితే గానీ విషయం ఏమిటన్నది తెలుస్తుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు