అమల ఒకటి.. ప్రియ మూడు వదులుకున్నారు

10 Dec, 2017 00:27 IST|Sakshi

మ్యాచ్‌ రిజల్ట్‌ని రెయిన్‌ చేంజ్‌ చేస్తుంది. ఆ మాటకొస్తే చాలా విషయాల్లో రెయిన్‌ ఇబ్బందులపాలు చేస్తుంది. ఇప్పుడు మాత్రం వరుణుడు హీరోయిన్‌ అమలా పాల్‌ను ఇరుకుల్లో పడేశాడు. ఎలాగంటే.. హెవీ రెయిన్స్‌ వల్ల అమలా పాల్‌ ఓ సినిమా చాన్స్‌ను వదులుకోవాల్సి వచ్చిందట. నివీన్‌ పౌలీ హీరోగా రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో మలయాళంలో రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ ‘కాయమ్‌కులమ్‌ కోచున్ని’. ఇందులో హీరోయిన్‌ జానకి పాత్రకు ముందుగా అమలా పాల్‌ను సెలక్ట్‌ చేశారు. ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు.

కానీ, సడన్‌గా అమలా పాల్‌ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్‌లో ప్రియా ఆనంద్‌ను కథానాయికగా తీసుకున్నారు. తెలుగులో లీడర్, 180, కో అంటే కోటి వంటి చిత్రాల్లో ప్రియా ఆనంద్‌ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘రీసెంట్‌గా పడిన వర్షాల వల్ల మా సినిమా షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి. ఆ చేంజేస్‌ ఏఫెక్ట్‌ అమలా పాల్‌ డేట్స్‌పై పడింది. ఆమె బిజీ హీరోయిన్‌. మార్చిన తేదీలకు తగ్గట్టుగా అమలా పాల్‌ డేట్స్‌ ఇవ్వలేకపోయారు. అందుకే ప్రియా ఆనంద్‌ను హీరోయిన్‌గా తీసుకున్నాం’’ అన్నారు రోషన్‌.

‘‘ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ గ్రేట్‌ ప్రాజెక్ట్‌లో యాక్ట్‌ చేసేందుకు నేను మూడు సినిమాలను వదులుకున్నాను’’ అన్నారు ప్రియ. అయితే మరోవైపు ఈ ‘కాయమ్‌కులమ్‌ కోచున్ని’ చిత్రంలో అమలా పాల్‌ను కావాలనే తప్పించారని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు. ‘ఫర్‌ యువర్‌ ఇన్ఫర్మేషన్‌. ఇది రీ–ప్లేస్‌మెంట్‌ కాదు. డేట్స్‌ కుదరక నేనే తప్పుకున్నా. అండ్‌.. నేను మీకులా ఖాళీగా లేను ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయడానికి’’ అని స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు అమలాపాల్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు