విష్ణు విశాల్‌ సినిమాలో ప్రియా

17 Sep, 2019 10:33 IST|Sakshi

‘రాక్షసన్‌’చిత్రం సక్సెస్‌తో లైమ్‌లోకి వచ్చిన యువనటుడు విష్ణువిశాల్‌. ఇప్పుడు ఆయనతో రొమాన్స్‌కు నటి ప్రియా భవానీ శంకర్‌ సై అంటున్నట్లు తాజా వార్త. విష్ణువిశాల్‌ ప్రస్తుతం జగజాలా కిల్లాడి, ఎఫ్‌ఐఆర్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా మరో కొత్త చిత్రానికి కమిట్‌ అయ్యారు. ఇందులో లక్కీ హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించనుంది.

‘మేయాదమాన్‌’చిత్రంతో వెండితెరపైకి వచ్చిన బుల్లితెర నటి ఈ అమ్మడు. తొలి చిత్రమే సక్సెస్‌ కావడంతో హీరోయిన్‌గా సెటిల్‌ అయ్యిపోయ్యింది. ఆ తర్వాత కార్తికి జంటగా నటించిన కడైకుట్టి సింగం, ఎస్‌జే.సూర్యతో నటించిన మాన్‌స్టర్‌ చిత్రాల విజయాలు ప్రియా భవానీ శంకర్‌ కెరీర్‌కు బాగా హెల్ప్‌ అయ్మాయి. దీంతో ఈ చిన్నది బిజీ హీరోయిన్‌గా మారింది.

శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్‌ 2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కురిది ఆట్టం, కలత్తిల్‌ సందిప్పోమ్, కసర తపర, మాఫియా ఛాప్టర్‌ అంటూ అరడజను చిత్రాల వరకు నటిస్తుంది. తాజాగా విష్ణువిశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాను విష్ణువిశాల్‌ స్వయంగా తన విష్ణువిశాల్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించనున్నారు. చెల్ల దర్శకత్వం వహించనున్నారు.

వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు సిలుక్కువారుపట్టి సింగం అనే వినోదభరిత చిత్రం వచ్చింది. తాజా చిత్రాన్ని  ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే మరొ కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు