ఆమె కనుసైగలకు..అబ్బాయిలు ఫిదా!

12 Feb, 2018 12:54 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్‌ డే ఫీవర్‌ నడుస్తోంది. ఓ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఎలా ప్రపోజ్‌ చేయాలి..? అని తికమకపడుతున్న ఈ సమయంలో... ఓ హైస్కూల్‌ అబ్బాయి-అమ్మాయి కళ్లతోనే ఐ లవ్‌ యూ చెప్పే వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.  ఇక ఈ అమ్మాయి చూపించే కనుసైగలకు అబ్బాయిల మనసులు ఫుల్‌గా ఫిదా అయిపోతున్నాయి.

ఈ వీడియో మళయాలంలోని 'ఓరు అదార్‌ లవ్‌' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలోనిది. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతుంది. ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. మాటలు లేకుండా కేవలం హీరో హీరోయిన్‌ కనుబొమ్మలను ఎగరేయడం, కన్ను కొట్టుకోవడం వంటి హావభావాలతోనే లవ్‌ ప్రపోజ్‌ చేసుకుంటారు. క్లాస్ రూంలో జరిగే ఈ లవ్ ట్రాక్‌ని అద్భుతంగా చిత్రీకరించారు. 

పదే పదే ఆ వీడియోను చూస్తూ... ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌నే అబ్బాయిలు వాట్సాప్‌ స్టేటస్‌లుగా పెట్టేసుకుంటున్నారు. ఒక్క రోజులోనే ఈ అమ్మాయి సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయింది కూడా. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌, పలు న్యూస్‌ పోర్టల్స్‌ అన్నింటిలోనూ ఈ అమ్మాయి హావభావాలే చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ వీడియో విడుదలైన 8 గంటల్లోనే ప్రియా ప్రకాశ్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌కు 4 లక్షల మంది ఫాలోవర్స్‌ వచ్చి చేరారు. 26 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్‌ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో అతి కొద్ది సమయంలో.. ఎక్కువ షేర్లు అయిన క్లిప్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వీడియోకి 40 లక్షల వ్యూస్‌ కూడా వచ్చాయి. వాలెంటైన్స్ డే వీక్ నడుస్తుండటంతో.. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇలాంటి ఒక్క అమ్మాయి ఉంటే చాలు... క్లాస్‌లో అబ్బాయిల అటెండెన్స్‌ 100 శాతం ఉంటుందంటూ సోషల్‌ మీడియా యూజర్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరిన్ని వార్తలు