నైన్త్‌ క్లాస్‌లోనే ప్రేమలో పడ్డాను

31 Dec, 2019 09:39 IST|Sakshi

సినిమా: పడ్డానండీ ప్రేమలో మరి.. విడ్డూరంగా ఉందిలే ఇదీ. ఏమిటీ పాటల గోల అని అనుకుంటున్నారా? నటి ప్రియా ప్రకాశ్‌వారియర్‌ కూడా తన విడ్డూరమైన ప్రేమ గురించి ఇటీవల చెప్పుకొచ్చింది. సాధారణంగా ఓ నటికి ఒక సినిమా హిట్‌ అయినా పెద్దగా క్రేజ్‌ రాదు. అదీ సంచలన విజయం సాధిస్తే పేరు రావచ్చు. అయితే తొలి చిత్ర ట్రైలర్‌తోనే అనూహ్య క్రేజ్‌ను సంపాదించుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌వారియర్‌. అంతే కాదు ఆ ఒక్క ట్రైలర్‌తోనే ఆ చిత్రం ఏకంగా మూడు భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రమే ఒరు ఆదార్‌ లవ్‌. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం మాతృభాషలోనే కాకుండా చాలా అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లోనూ అనువాదమైంది. అయితే పూర్తిగా నిరాశ పరిచింది. అయినా నటి ప్రియాప్రకాశ్‌వారియర్‌కు మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. మోడలింగ్, వాణిజ్యప్రకటనలు, మోడలింగ్‌ అంటూ యమ బిజీ అయిపోయింది. ప్రస్తుతం శ్రీదేవి బంగ్లా అనే చిత్రంలో నటిస్తోంది.

ఇది అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్‌ అనే ప్రచారం జరగడంతో పెద్ద వివాదాంశంగా మారింది. ఇకపోతే తెలుగులో ఈ అమ్మడిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. హిందీలో నటించాలనే ఆసక్తితో ఉన్న  ప్రియా ప్రకాశ్‌వారియర్‌ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ బ్యూటీ ఏదో ఒక అంశంతో తరచూ వార్తల్లో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటోందనిపిస్తోంది. తాజాగా తన తొలి ప్రేమ వ్యవహారం గురించి ఇలా చెప్పుకొచ్చింది. “నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డాను. సహ నటుడు నన్ను ప్రేమించాడు. ఆ విషయాన్ని ఒక రోజు నాకు చెప్పాడు. అతని సిన్సియారిటీ ప్రపోజల్‌ ఆకట్టుకోవడంతో నేనూ అతన్ని ప్రేమించాను. అలా కొన్ని రోజులు ఒకరినొకరం ప్రేమలో మునిగి తేలాం. అయితే  ఆ వయసులో ప్రేమ నాకే విడ్డూరంగా అనిపించింది. దీంతో మన మధ్య ఉన్నది తెలిసీ తెలియని వయసు ప్రేమ అని, ఇందులో మోహం మినహా నిజమైన ప్రేమ ఉండదని అతనికి చెప్పాను. నేను వివరించిన తీరు అతన్ని కన్వెన్స్‌ చేసింది. దీంతో ప్రేమకు దూరం అయ్యాం.అయితే ఇప్పటికీ మా మధ్య స్నేహం కొనసాగుతూనే ఉందని’ చెప్పింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా