లవ్‌ను హ్యాక్‌ చేస్తా

1 May, 2019 00:02 IST|Sakshi

‘ఇది డిజిటల్‌ యుగం. జాగ్రత్తగా లేకపోతే మన ఇన్‌ఫర్మేషన్‌ అయినా, మన లవ్‌ అయినా ఈజీగా హ్యాక్‌ అయిపోతుంది’ అంటున్నారు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. కేవలం కన్ను గీటి సౌత్‌ నుంచి నార్త్‌ వరకూ పాపులర్‌ అయ్యారు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. తన తొలి సినిమా ‘ఒరు అధార్‌ లవ్‌’ రిలీజ్‌ కంటే ముందే బాలీవుడ్‌ ఆఫర్‌ సంపాదించుకున్నారు. ‘ఒరు అధార్‌ లవ్‌’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. బాలీవుడ్‌ తొలి సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ వివాదాల్లో ఉంది. లేటెస్ట్‌గా బాలీవుడ్‌లో మరో సినిమా సైన్‌ చేశారు ప్రియా వారియర్‌.

మయాంక్‌ ప్రకాశ్‌ శ్రీవాత్సవ్‌ రూపొందించనున్న ‘లవ్‌ హ్యాకర్స్‌’ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా ప్రకాశ్‌ యాక్ట్‌ చేయనున్నారు. సైబర్‌క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమా గురించి ప్రియా వారియర్‌ మాట్లాడుతూ – ‘‘అనుకోకుండా ఓ ట్రాప్‌లో చిక్కుకున్న హీరోయిన్‌ తన తెలివితేటలతో చాకచక్యంగా ఎలా తప్పించుకుంది? అనేది కథ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది’’ అని అన్నారు.  

మరిన్ని వార్తలు